బడంగ్ పేట్:
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం అయినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించి ఆరోజు 2001లో కేసీఆర్ అప్పటి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకం చేసి అప్పటి కేంద్ర కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా ఎన్నో అడుగులు వేశారు కేసీఆర్ అప్పటికి తెలంగాణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వేచిచూసే దూరంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ 29 నవంబర్ 2009వ సంవత్సరంలో కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదాలు తీసుకొని 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీరు మనమందరం కూడా గమనించాం.మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజును అప్పటి నుంచి దీక్షా దివస్ గా పరిగణించి వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈనెల 29వ తేదీన మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్ లోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాల్లో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా విభాగం, పార్టీ కార్యకర్తలు విధిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్, మీర్పేట పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఉద్యమకారుల కన్వీనర్ నేలకొండ శ్రీనివాస్ రెడ్డి, సిద్ధాల భరత్ జగన్మోహన్ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు


