Thursday, November 5, 2026
Google search engine
Homeతెలంగాణబిఅరెస్ లో చేరిన దామోదర్ రెడ్డి

బిఅరెస్ లో చేరిన దామోదర్ రెడ్డి

  • మియాపూర్ భూమిలో ఉద్యమకారులకు ఇళ్లు కట్టించాలి
  • గులాబీ గూటికి పెద్దసంఖ్యలో చేరికాలు
  • రబోయేది బిఅరెస్ ప్రభుత్వమే: కేటీఆర్

కూకట్పల్లి:నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ అభివృద్దికై అధ్యక్షుడిగా గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసి ప్రజలకు ఎంతో సేవచేసుకున్న దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బుధవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో ఆయన దామోదర్ రెడ్డితో పాటు అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం మియాపూర్‌లో భూములు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ అక్కడే స్థలాలు కేటాయించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
అలాగే హైదరాబాద్‌లోని నిరుపేదలకు 100 ఎకరాల విస్తీర్ణంలో నాణ్యమైన టవర్స్ నిర్మించి ఇళ్లు కేటాయించాలని సూచించారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు.
అమరవీరుల కుటుంబాలకు ఎర్రవెల్లిలో ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న ఎర్రవెల్లిలో కాకుండా నగరంలోని మియాపూర్‌లోనే అమరవీరుల కుటుంబాలకు మెరుగైన వసతులతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మియాపూర్‌లో భూములు ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలకు అక్కడే గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ రాగి రాజు, మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, బొబ్బ నవత రెడ్డి, సాయిబాబా, భాస్కరరావు, యోగేష్, రెడ్డి సుధాకర్ రెడ్డి, రేణుక, సుబ్బలక్ష్మి, శేఖర్ స్వామి, శృతి, ధర్మారెడ్డి, బాల్రెడ్డి, సుబ్బరాజు, సంజీవరెడ్డి, శివారావు, పప్పు, కలీం, నక్క శ్రీనివాస్, మాధవి, అడ్వకేట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments