Tuesday, September 29, 2026
Google search engine
Homeతెలంగాణమధుయాష్కి సారథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు

మధుయాష్కి సారథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు

దేశ నిర్మాణంలో నిపుణుల సేవలు అనివార్యం : జైరాం రమేష్

న్యూఢిల్లీ:

దేశ సమగ్ర అభివృద్ధిలో వృత్తి నిపుణులు సేవాభావంతో ముందుకు వచ్చి కీలక పాత్ర పోషించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పిలుపునిచ్చారు.
భారతదేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జన్మదిన వేడుకలను న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  • ఇందిరా భవన్ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ లైబ్రరీని మధుయాష్కి గౌడ్ తో కలిసి జైరాం రమేష్ సందర్శించారు.
  • మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన ఆర్థిక సంస్కరణలు మరియు అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.
  • లైబ్రరీ చైర్మన్ జైరాం రమేష్ కు, మధుయాష్కి గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఆ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.

*ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా...
గత ఒక ఏడాది కాలంగా మన్మోహన్ సింగ్ ఫెలోస్ గా తమ బాధ్యతలను నిర్వర్తించడం ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు, దేశ నిర్మాణానికి వృత్తి నిపుణులు అందించాల్సిన సహకారంపై సవివరంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జైరాం రమేష్ ఉద్ఘాటించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ లైబ్రరీతో వృత్తి నిపుణులు కొనసాగిస్తున్న అనుబంధాన్ని, భవిష్యత్ కార్యాచరణను నాయకులు సమీక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments