అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో వేలం నిర్వహణ
ఎల్బీనగర్
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, రోడ్లపై వదిలేసిన మొత్తం 510 ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలను వేలం ద్వారా విక్రయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వాహనాలను అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో భద్రపరిచారు.
చట్ట ప్రకారం వేలం ప్రక్రియ
ఈ వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాహన యజమానులు, హైపోథికేషన్ హక్కులు కలిగిన వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థలు తమ వాహనాలకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని పోలీసులు సూచించారు.
వాహన యజమానులకు ఆరు నెలల గడువు
వాహనాలపై యాజమాన్య హక్కులు కలిగిన వావాహనాలపై యాజమాన్య హక్కులు కలిగిన వారు అవసరమైన పత్రాలతో ఆరు నెలల్లోపు తమ క్లెయిమ్‌లను సమర్పించాలని పోలీసులు కోరారు. నిర్ణీత గడువులోగా ఎవరూ ముందుకు రాకపోతే చట్ట ప్రకారం వేలం ప్రక్రియ చేపట్టనున్నారు.
వివరాలు ఇలా తెలుసుకోండి
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి Citizen Services → Abandoned Vehicles →2026 ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
వాహనాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు ఉంటే కింది నంబర్లను సంప్రదించవచ్చు.
సంప్రదించాల్సిన నంబర్లు:
8712662661, 8008338535
వాహనం మీ పేరుతో ఉందా? అయితే పోలీసుల వెబ్‌సైట్‌లోని జాబితాను ఒకసారి పరిశీలించండి. ఆరు నెలల గడువు ముగిసేలోపు మీ హక్కులను నిరూపించుకోండి. మీ వాహనాన్ని పొందండి.


