Tuesday, October 27, 2026
Google search engine
Homeతెలంగాణమహేశ్వరం గడ్డపై భగ్గుమన్న ప్రజా ఆగ్రహం

మహేశ్వరం గడ్డపై భగ్గుమన్న ప్రజా ఆగ్రహం

  • మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల ప్రభుత్వం, పోలీసుల అమానుష తీరుపై మిన్నంటిన నిరసన జ్వాలలు
  • ప్రజాస్వామ్య వ్యవస్థకు, యావత్ తెలంగాణ మహిళా లోకానికి తగిలిన తీరని మచ్చ: భగ్గుమన్న ప్రజాక్షేత్రం
  • మహిళా ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని మంటగలిపే నియంతృత్వ పోకడలపై రాష్ట్రవ్యాప్తంగా ఉధృత హెచ్చరిక

హైదరాబాద్:

రాష్ట్ర ప్రజానీకం ఎన్నుకున్న ప్రజాస్వామ్య దేవాలయం సాక్షిగా, అభినవ తెలంగాణ సాదనలో అగ్రభాగాన నిలిచిన మహిళా నాయకురాలపై జరుగుతున్న దుర్మార్గపు దాడులు పరాకాష్టకు చేరాయి. శాసనసభ ప్రాంగణంలో మహేశ్వరం శాసనసభ్యురాలు, మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పట్ల ప్రభుత్వం మరియు రక్షక భటుల తీరు అమానుషంగా, హేయంగా సాగింది. ఒక మహిళా ప్రజాప్రతినిధికి జరిగిన ఈ పరాభవం కేవలం ఒక్క వ్యక్తికి జరిగిన అవమానం కాదు; యావత్ తెలంగాణ మహిళా లోకానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు తగిలిన తీరని మచ్చ. ఈ దుశ్చర్యను నిరసిస్తూ నేడు మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కట్టలు తెంచుకున్న ప్రజా కోపంతో మహాధర్నా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.

*అణచివేతకు ప్రతీకగా పోలీసుల దురహంకారం
ప్రజాక్షేత్రంలో ప్రజల గొంతుకగా నిలిచి, అడుగులు ముందుకు వేస్తున్న మహిళా నేతలను అణచివేయడమే లక్ష్యంగా పాలకుల కుట్రలు సాగుతున్నాయి. శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధిని విస్మరించి, ప్రశ్నిస్తున్న గొంతులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్న తీరు అత్యంత గర్హనీయం. సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్ నాయకురాలిని సైతం లక్ష్యంగా చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పాలకుల అరాచక పాలనకు ప్రత్యక్ష నిదర్శనం. రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజాప్రతినిధులపై జరుపుతున్న దుర్మార్గపు దాడులు రాజ్యాంగ స్పూర్తిని కాలరాసేలా ఉన్నాయి.

*నియోజకవర్గంలో మిన్నంటిన నిరసన జ్వాలలు
ఈ అమానుష ఘటనపై మహేశ్వరం నియోజకవర్గం ఒక్కసారిగా భగ్గుమంది. సబితమ్మకు జరిగిన అవమానాన్ని సహించలేక వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, ప్రజానీకం రోడ్లపైకి వచ్చి మహాధర్నా చేపట్టారు. మహిళా ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్న ఈ ప్రభుత్వ వైఖరిపై ఉరుములు ఉరిమినట్లుగా నినాదాలు మార్మోగాయి. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ నియంతృత్వ పోకడలకు పోతున్న ప్రభుత్వానికి ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెబుతారని ఈ మహాధర్నా చాటిచెప్పింది.

*ప్రజా శక్తితోనే పాలకుల భరతం పడతాం
ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులైన అధికారులపై మరియు కుట్ర వెనుక ఉన్న పెద్దలపై సమగ్ర విచారణ జరిపించాలి. తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని కూడా భారత శక్తి దిన పత్రిక తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మహిళా మణుల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments