ఎల్బీనగర్:
ప్రతిష్టాత్మక యువ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్వర్గీయ డా. ఎపిజె అబ్దుల్ కలాం జయంతి వేడుకలు చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో వివిధ రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ కు “డా. ఎపిజె అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ” అవార్డును అందచేశారు.ఈ సందర్భంగా యువ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డా.వెంకటరమణ మాట్లాడుతూ, అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ అనాథ విద్యార్థుల అన్ని భాద్యతలను భుజాన వేసుకుని, వసతి, భోజన మరియు కార్పొరేట్ విద్యా సౌకర్యాలు కల్పించి వారి ఉన్నత చదువులకు, బంగారు భవిష్యత్తుకు నిస్వార్థంగా, స్వచ్ఛందంగా,అహర్నిశలు కృషి చేస్తున్నoదుకు డా. ఎపిజె అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ అవార్డుకు ఎంపిక చేశామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ వేణుగోపాల చారి, జానపద గాయని శ్రీమణి,సరోజిని నాయుడు కాలేజీ కరెస్పాడెంట్ జనార్ధన్ రెడ్డి హాజరైనారు.


