Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణరాక్ టౌన్ కమ్యూనిటీ హాల్ లో దసరా ఉత్సవాలు..

రాక్ టౌన్ కమ్యూనిటీ హాల్ లో దసరా ఉత్సవాలు..

అధిక సంఖ్యలో పాల్గొన్న కాలనీ సభ్యులు..
ఇతర కాలనీల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరు..

రాక్ టౌన్ కమ్యూనిటీ హల్ లో అసోసియేషన్ వారు నిర్వహించిన దసరా ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొన్న రాక్ టౌన్ కాలనీ సభ్యులు, పరిసర కాలనీల సభ్యులు. ఈ యొక్క ఉత్సవాలులో దసరా రోజు జమ్మి పూజతో పాటు ఆయుధ పూజ పాల పిట్ట దర్శనం, ప్రత్యేకంగా భారీ ఎత్తులో ఉన్న రావణాసుర దహన కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం నవరాత్రులలో 9 రోజులు మహిళలు బతుకమ్మ/దాండియా, ప్రతి రోజు అమ్మవారికి సాయంత్రం మహిళలందరు పారాయణంతో పాటు వివిధ అలంకరణలు చేసారు. ఆలాగే చివరి రోజు దసరా నాడు భారీ సంఖ్యలో పిల్లలు, మహిళలు, (కమిటీ సభ్యులు, కాలనీ సభ్యులు )పెద్దలు పాల్గొని ఈయొక్క విజయదశమి ని కమిటీ సభ్యులు, కాలనీ సభ్యులందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది అని రాక్ టౌన్ ప్రెసిడెంట్ ఎర్ర వినోద్ రెడ్డి తెలియజేసారు.

ఆలాగే ఈయొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాక్ టౌన్ సొసైటీ తరుపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.. అలాగే విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments