Tuesday, November 17, 2026
Google search engine
Homeతెలంగాణవిధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు సమన్వయం, సత్ప్రవర్తన ముఖ్యం: గవర్నర్.

విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు సమన్వయం, సత్ప్రవర్తన ముఖ్యం: గవర్నర్.

  • ఏడీసీ అమన్ కుందు సేవలను ప్రశంసించిన గవర్నర్.
  • వీడ్కోలు కార్యక్రమంలో ఘనంగా సత్కారం

హైదరాబాద్:

విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమర్థతతో పాటు సత్ప్రవర్తన, పరస్పర గౌరవం, సమన్వయం ఎంతో ముఖ్యమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.
లోక్‌భవన్‌లో సోమవారం సాయంత్రం తన ఏడీసీగా (ఎయిడ్ డి క్యాంప్) సేవలందించిన అమన్ కుందు వీడ్కోలు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా , వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా తో కలసి ఆయనను సత్కరించి, సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భద్రతా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ, సహచరుల పట్ల మర్యాద, గౌరవంతో మెలగాలని అన్నారు. ఇవే సమర్థవంతమైన అధికారికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు.
సైన్యంలో పదోన్నతులు క్రమశిక్షణ, పనితీరు, అంకితభావం, సేవా రికార్డు ఆధారంగా లభిస్తాయని చెప్పారు. ఎక్కడ పనిచేసినా దేశ సేవ, దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు.
లోక్‌భవన్‌లో అమన్ కుందు అందించిన సేవలు, సహకారం అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు. స్క్వాడ్రన్ లీడర్ హరీష్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
లోక్‌భవన్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు అన్ని భద్రతా విభాగాలు, అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని గవర్నర్పేర్కొన్నారు .
అమన్ కుందు స్థానంలో నూతన ఏడిసి గా బాధ్యతలు చేపట్టిన స్క్వాడ్రన్ లీడర్ హరీష్‌ చందర్ కు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్ , జాయింట్ సెక్రెటరీ శ్రీ శశికిరణ్ కోమండూర్ , ఏడిసి శ్రీ కాంతిలాల్ అమన్ కుందు సేవలను కొనియాడారు .
ఈ సందర్భంగా అమన్ కుందు మాట్లాడుతూ .. లోక్ భవన్ అధికారులు , ఉద్యోగుల సహకారం తో ఏడిసి గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించానని చెప్పారు .
కార్యక్రమంలో లోక్ భవన్ అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments