బడంగ్ పేట్:
మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాదర్గుల్ డివిజన్లోని ప్లాటినం సిటీలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ కృత్య ప్రత్యంగిరా దేవి ఆలయంలో నిర్వహిస్తున్న 12 రోజుల మహా ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములుతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కృత్య ప్రత్యంగిరా అమ్మవారిని, శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సదాపూర్ణి కృత్య ఆనందం తాంత్రి అయ్యర్ గారి ఆశీర్వచనాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతులు ఎన్. రామచందర్ రావు అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బిజెపి డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


