మొద్దు లచ్చిరెడ్డి నాయకత్వంలో బి.ఎన్.రెడ్డి నగర్ నుండి కదలివచ్చిన జనసందోహం
హైదరాబాద్:
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పాలనా విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహా పాదయాత్ర’ నగరంలో అత్యంత వైభవంగా సాగింది. ప్రజాస్వామ్య సూత్రాల పరిరక్షణ, ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా సాగిన ఈ యాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించి, నడిపించారు.
అమిత్ షా అడుగులో అడుగు కలిపిన లచ్చిరెడ్డి దండు:
ఈ యాత్రలో బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. మొద్దు లచ్చిరెడ్డి నాయకత్వంలో సాగిన ఈ భారీ జనసమీకరణ యాత్ర విజయానికి ప్రధాన బల నిరూపణగా నిలిచింది.
*ప్రజా పోరాటమే ఊపిరి – మొద్దు లచ్చిరెడ్డి:
యాత్ర సందర్భంలో మొద్దు లచ్చిరెడ్డి మాట్లాడుతూ — ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ, ప్రజల తరఫున గళం విప్పడంలోనూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో సాగిన ఈ మహా పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని, ప్రజల తరఫున క్షేత్రస్థాయి పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
ఈ ప్రజా సమీకరణలో స్థానిక కాలనీల ప్రతినిధులు శంకరయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విఠల్ రెడ్డిలతో పాటు డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు పాల్గొన్నారు. అలాగే రంగారెడ్డి అర్బన్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీధర్ రావు, చేనేత విభాగానికి చెందిన రఘురాం నేత, కిసాన్ విభాగ ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, యువజన విభాగ అధ్యక్షుడు సురేష్ కుమార్ భాగస్వాములయ్యారు.
వీరితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, శంకరన్న, వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రావు, ప్రభాకర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజు, ప్రేమ్, దుర్గాప్రసాద్, కృష్ణ ప్రసాద్, పరమేష్, సందీప్, శ్రవణ్ తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.



