Thursday, November 12, 2026
Google search engine
Homeతెలంగాణ18 ఎకరాల భూ సమస్యపై దళిత రైతులకు న్యాయం చేయాలి – ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్...

18 ఎకరాల భూ సమస్యపై దళిత రైతులకు న్యాయం చేయాలి – ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్:

హయత్‌నగర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 255/1లో ఉన్న 18 ఎకరాల భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించి బాధిత దళిత రైతులకు న్యాయం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. సుమారు 70 సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో లాక్కుందని తెలిపారు. రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన వివాదం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు,భూమి హక్కులకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని,అర్హులైన బాధిత రైతులకు న్యాయం జరిగేలా సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 2022లో భారాస ప్రభుత్వం బాధిత రైతులకు ఎకరానికి 500 గజాల స్థలం కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోని సంతకాలు సేకరించిదని, ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను టార్గెట్ చేసి 300 గజాల స్థలం ఇచ్చేలా చెప్పడం సరైంది కాదని అన్నారు. భూములు కోల్పోతున్న బాధిత రైతులకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి 600 గజాల స్థలం ఇవ్వాలని సుధీర్ రెడ్డి కోరారు. అలాగే సాహెబ్ నగర్ శ్రీ.వెంకటేశ్వర కాలనీ వీకర్ సెక్షన్ సర్వే నెంబర్ 71/1నందు గత భారాస ప్రభుత్వ హయాంలో 58,59 జీ.ఓ.క్రింద దరఖాస్తు చేయడం జరిగిందని, దానిలో కొందరు 59 జీ.ఓ.క్రింద దాదాపు 23 మంది ఒక్కొక్కరు ఒక లక్ష యాభై అయిదు వేల రూపాయలు(1,55,000) డబ్బులు కూడా కట్టడం జరిగిందని తెలిపారు. అలాగే రెవిన్యూ అధికారులు పరిశీలిన కూడా జరిగిందని, వారి లిస్ట్ కూడా రావడం జరిగిందనీ తెలిపారు. అక్కడ పేద, మధ్య తరగతి ప్రజలు దాదాపు 80 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారికీ పట్టాలు ఇవ్వకుండా ఆపివేసిందని అన్నారు. తక్షణమే ఈ సమస్యల మీద చర్యలు తీసుకొని పట్టాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కటేపాక స్కైలాబ్,గంగాని నాగేష్, దుబ్బాక నవీన్, జయ ఈశ్వర్,బోడ శ్రీరాములు, కటేపాక ప్రవీణ్,గంగాని శ్రీను,బోడ శ్రవణ్,గంగాని ప్రవీణ్ శ్రీ వెంకటేశ్వర కాలనీ వీకర్ సెక్షన్ మాజీ అధ్యక్షులు కృష్ణ,బొమ్మడ శీను,రామాచారి,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments