Saturday, October 31, 2026
Google search engine
Homeతెలంగాణ37 ఏళ్ల అంకితభావానికి అభినందనల వెల్లువ

37 ఏళ్ల అంకితభావానికి అభినందనల వెల్లువ

పదవీ విరమణ వేళ ప్రధానోపాధ్యాయురాలు మూసా వనజకు ఘన సత్కారం

ఎల్బీనగర్

హయత్‌నగర్ హెచ్‌డబ్ల్యూ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మూసా వనజ పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సురేష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా విద్యారంగానికి విశేష సేవలందించిన ఆమె రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా అధికారులు, తోటి ఉపాధ్యాయులు, సహచరులు, విద్యార్థులు పూలవర్షం కురిపిస్తూ ఆమెను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హయత్‌నగర్ ఎంఈఓ శ్రీనివాసులు, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘునందన్, హయత్‌నగర్ కాంప్లెక్స్ హెచ్‌ఎం రమాదేవి, సాహెబ్‌నగర్ గెజిటెడ్ హెచ్‌ఎం దినేష్, పీఆర్‌టీయూ హయత్‌నగర్ మండల అధ్యక్షుడు దీన్‌దయాల్, ఎస్‌టీయూ మండల అధ్యక్షుడు ఏడుకొండలుతో పాటు పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మూసా వనజ చేసిన కృషి, అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. 37 ఏళ్ల సుదీర్ఘ విద్యా ప్రస్థానంలో ఆమె ప్రదర్శించిన అంకితభావం, క్రమశిక్షణ, సేవానిరతి ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమని పేర్కొన్నారు.

అనంతరం మూసా వనజ మాట్లాడుతూ తన 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయని తెలిపారు. తాను ఈ స్థాయికి ఎదగడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తన భర్త కృష్ణయ్య అందించిన ప్రోత్సాహం, సహకారం, అండదండలు మరువలేనివని భావోద్వేగంగా తెలిపారు. తన వృత్తి జీవితంలోని ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచిన భర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యారంగానికి మూసా వనజ అందించిన 37 ఏళ్ల సేవలు చిరస్మరణీయమని, పదవీ విరమణ అనంతరం ఆమె జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments