ఎల్బీనగర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026 కు సంబంధించిన లోగో మరియు మస్కట్ పోస్టర్‌ను బుధవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), కొంగరకలాన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి, ఐఏఎస్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి శ్రీమతి ఎస్. స్వర్ణలత, డిప్యూటీ కలెక్టర్ మరియు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026 సరోర్నగర్ స్టేడియం వేదిక ఇన్‌చార్జి శ్రీమతి కె. అనూష సూపరింటెండెంట్ సత్యనారాయణమూర్తి, ఎం.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి జాతీయ స్థాయి క్రీడా పోటీలు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని, యువ క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తి, ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని సరోర్నగర్ ఇండోర్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్ మరియు ఖో-ఖో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎస్. స్వర్ణలత తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026పై ప్రజల్లో, ముఖ్యంగా యువత మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.



