చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన బీజేపీ నాయకులు
ఎల్బీనగర్
ఎల్ బి నగర్ 22-11-2026 ఆదివారం రోజున నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జీ.ఎస్.ఐ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను బీజేపీ జీఎస్ఐ డివిజన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా వివిధ పోలియో కేంద్రాల్లో 0 – 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం జరిగింది. పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు వివరించారు.
పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జీఎస్ఐ డివిజన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సిద్దాల ఐలయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ పాల్వాయి సంజీవ రెడ్డి, జనరల్ సెక్రటరీలు గోపాల్ శర్మ, రాజు గౌడ్, సత్యనారాయణ రెడ్డి, దయాకర్ రెడ్డి, వెంకట్రాం వంశీ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు – పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం.


