Thursday, November 26, 2026
Google search engine
Homeతెలంగాణసినిమా చూసి "కింగ్ బుద్ధ" చిత్ర పోస్టర్ లాంచ్ చేసిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

సినిమా చూసి “కింగ్ బుద్ధ” చిత్ర పోస్టర్ లాంచ్ చేసిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్:

నటుడు సత్యారెడ్డి డైరెక్షన్ లో రెండు సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి, అనేక బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ “కింగ్ బుద్ధ”.ఈ సినిమా పోస్టర్ ను ఏఐసీసీ ప్రెసిడెంట్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రముఖ బౌద్ధ బిక్షుల సమక్షంలో ఘనంగా లాంచ్ చేశారు.ఒక భారతీయుడు ముఖ్యంగా ఒక తెలుగువాడు కింగ్ బుద్ధ పేరుతో గౌతమ్ బుద్ధుని చరిత్రను హాలీవుడ్ లో నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటం చాలా సంతోషకరమని చిత్ర యూనిట్ కు, నటీనటులకు,సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇప్పటివరకు పూర్తయిన కింగ్ బుద్ధ చిత్రాన్ని స్వయంగా వీక్షించిన మల్లికార్జున ఖర్గే చిత్రంలోని సన్నివేశాల గురించి క్యారెక్టర్ల గురించి చిత్ర నిర్మాణం గురించి కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, గౌతమ్ బుద్ధ పాత్రధారి సత్యారెడ్డి మాట్లాడుతూ, “అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే తన దర్శకత్వంలోని కింగ్ బుద్ధ ఇండియన్ లాంగ్వేజ్ పోస్టర్లను లాంచ్ చేయటంతోపాటు కొన్ని సూచనలు చేయటం చాలా సంతోషంగా ఉంది. బౌద్ధ ధర్మం మీద మల్లికార్జునకు చాలా అవగాహన ఉందని, కర్ణాటక రాష్ట్రంతో పాటు గుల్బర్గా ప్రాంతంలో బుద్ధిజాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన చాలా కృషి చేశారు. ఆయన సూచనలు తప్పకుండా పాటిస్తాము. వచ్చే సంవత్సరం బుద్ధ జయంతికి ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకు పైగా ఎక్కువ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇప్పటివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, థాయిలాండ్, శ్రీలంక, మలేషియా, వియత్నాం, లావోస్ తోపాటు అనేక బౌద్ద దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ చేశాం. త్వరలో ఈ చిత్ర టీజర్ ను ఆసియా ఖండంలోని ఒక దేశ ప్రధాని చేతులమీదుగా అనేక బుద్ధిష్టు దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువుల సమక్షంలో ఘనంగా విడుదల చేస్తామని డైరెక్టర్ సత్యారెడ్డి అన్నారు. కింగ్ బుద్ధ హాలీవుడ్ చిత్రానికి తాను దర్శకత్వం వహించడంతో పాటు గౌతమ బుద్ధుని పాత్రలో నటించడం తన అదృష్టమని ఈ చిత్రం కోసం తాను 12 కేజీల బరువు కూడా తగ్గానని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రమేష్, పవన్ రామ్ తో పాటు అనేకమంది బౌద్ధ బిక్షువులు పాల్గొని చిత్ర యూనిట్ ని ఆశీర్వాదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments