పి ఏ సి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ.
శేరిలింగంపల్లి :
చందానగర్ డివిజన్ పరిధిలోని పిజేఆర్ స్టేడియంలో జరిగిన శేరిలింగంపల్లి మండల బడ్జెట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్- 2026-27 కార్యక్రమం ముగింపు వేడుకలలో సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని , విజేతలకు బహుమతులు అందచేసిన పిఏసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్- 2026-27 కార్యక్రమం ను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగినది అని, విద్యార్థులు క్రీడా స్పూర్తి నీ ప్రదర్శించడం జరిగినది అని, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం అని , క్రీడల ద్వారా శారీరక శ్రమ తో పాటు మానసిక ఉల్లాసం కలుగునని, విద్యార్థులు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఏర్పరుచుకొని ఆ దిశగా అడుగులు వేయాలని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చక్కటి క్రమశిక్షణ ,ప్రణాళిక, ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియచేశారు.
పీజేఆర్ స్టేడియం ను 20 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నామని, అన్ని రంగాలలో అభివృద్ది చేస్తున్నాం అని,క్రీడాకారులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగినది అని, ఒక చక్కటి వేదిక అని , క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు చదువుతూ పాటు క్రీడలకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంచుకున్న క్రీడా రంగాలలో మంచి భవిష్యత్తు నిర్మించుకొని జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి మన ప్రాంత ఖ్యాతిని నలువైపుల చాటాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నరేందర్ బల్ల, శేరిలింగంపల్లి మండల బడ్జెట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ప్రెసిడెంట్ నిజాం అలీ ఖాన్, సెక్రటరీ వెంకటేష్, ట్రెజరర్ హిమ బిందు,స్టేట్ ప్రెసిడెంట్ భీష్మ రెడ్డి, వాసుదేవ రావు, అస్లాం,కిరణ్, శ్రీనివాస్ శంకర్,రాజు, భారత్ కుమార్,ఆచార్య మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



