- కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరు
హైదరాబాద్, నవంబర్ 27
రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా నవంబర్ ఈ నెల 28 వ తేదీన హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించే 24వ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు.
గవర్నర్ శనివారం ఉదయం లోక్ భవన్ నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
ఉదయం 11 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిస్తారు.
మధ్యాహ్నం 12.45 గంటలకు కార్యక్రమం ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.



