Home క్రైమ్ స్పెషల్ ప్రియుడితో పెళ్లి.. అడ్డుకున్న పోలీసులు..

ప్రియుడితో పెళ్లి.. అడ్డుకున్న పోలీసులు..

0
62
Police entry as both are minors.. Parents who wanted to marry the girl after getting pregnant.. The incident that saw the light in Hyderabad and Saidabad..
Police entry as both are minors.. Parents who wanted to marry the girl after getting pregnant.. The incident that saw the light in Hyderabad and Saidabad..

ఇద్దరూ మైనర్లే కావడంతో పోలీసుల ఎంట్రీ..
అమ్మాయి గర్భం దాల్చడంతో పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్..
హైదరాబాద్, సైదాబాద్ లో వెలుగు చూసిన ఘటన..

తమ కుమార్తె కొన్ని రోజులుగా ముభావంగా ఉండటంతో.. అనుమానం వచ్చిన తల్లి ఏం జరిగిందని ప్రశ్నించింది. ప్రియుడితో శారీరకంగా కలిసినట్లు అమ్మాయి చెప్పింది. దీంతో కుమార్తెను మందలించిన ఆ తల్లి.. ఆ కాలనీని విడిచిపెట్టి మరో ప్రాంతానికి మకాం మార్చింది. కానీ, ఇంతలోనే తన కుమార్తె గర్భం దాల్చినట్లు తెలిసింది. పైగా ఆ అమ్మాయి ప్రియుడు రహస్యంగా అక్కడికి వచ్చి ఆమెను కలుసుకుంటున్నట్లు గుర్తించింది. అమ్మాయికి అతడు వరుసకు బావే కావడంతో పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. తీరా పెళ్లి ముహుర్తానికి ముందు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ పెళ్లిని అడ్డుకున్నారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మైనర్లే కావడంతో.. ఆ పెళ్లిని అడ్డుకున్నారు. తన కుమార్తె 5 నెలల గర్భవతి అని, పెళ్లిని అడ్డుకోవద్దని.. ఆ తల్లి వేడుకున్నా అధికారులు వినలేదు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాచిగూడ పరిధిలోని ఓ కాలనీలో 6 నెలల కిందట మైనర్ల కుటుంబాలు నివసించేవి. సమీప బంధువులు కావడం, పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తుండటంతో బాలుడు (17), బాలిక (15) మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ శారీరకంగానూ దగ్గరయ్యారు. ఆ విషయం తెలియగానే బాలిక తల్లి సైదాబాద్ పరిధిలోని ఐఎస్ సదన్ సమీపంలో ఓ బస్తీకి నివాసం మార్చింది. కానీ, బాలిక ప్రియుడు అక్కడికి కూడా వచ్చి తన మరదలిని రహస్యంగా కలిసేవాడు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here