ఏపీ, తెలంగాణ మెరిట్ లిస్ట్ విడుదల..
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నాలుగో జాబితా (Post Office GDS 4th Merit List 2024)ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆగస్టు 19వ తేదీన మొదటి జాబితా, సెప్టెంబర్ 17వ తేదీన రెండో జాబితా, అక్టోబర్ 19వ తేదీన మూడో జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు పూర్తి వివరాలను https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఏపీ జీడీఎస్ నాలుగో జాబితా చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. అలాగే.. తెలంగాణ జీడీఎస్ నాలుగో జాబితా చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.