ఎల్బీనగర్:
సరూర్నగర్ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని పద్మావతి కళ్యాణ మండపంలో కాలనీ మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులకు పాద పూజ నిర్వహించి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి అనంతరం తంబోలా లాంటి ఆటలు ఆడి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆండాళ్, నీరజమ్మ, పద్మ, రమాదేవి, వెంకటసుబ్బమ్మ, ధనలక్ష్మి , అనురాధ, అరుణ, రాజ్యలక్ష్మి, రజని ,వసంతలక్ష్మి ,శ్రీ వేణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


