ఎల్బీనగర్:
శ్రీ రామకృష్ణాపురం (ఆర్కేపురం) డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పున్న గణేష్ నేత నియామకమయ్యారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పని చేస్తున్న గణేష్ నేత రెండవసారి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రెండవసారి నియామకానికి సహకరించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు, టీపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి సలహాలు సూచనలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా పనిచేస్తానని, డివిజన్లోని కాలనీల సమస్యలను తీర్చి సమస్యలు లేని డివిజన్ గా మార్చడానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.


