ఉలిక్కిపడుతున్న ఆఫ్రికా దేశం ఉగాండా..
ప్రబలుతున్న వింత రోగం..
రోగం చేసినవారు డ్యాన్సులు చేస్తున్నారు..
బాధితుల్లో మహిళలు, బాలికలే ఎక్కువ..
ఆఫ్రికా దేశం ఉగాండా ఓ వార్తతో ఉలిక్కిపడింది. అక్కడి బండిబుగ్యో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ఎందుకంటే.. అక్కడ దాదాపు 300 మందికి వింత రోగం పట్టుకుంది. స్థానికంగా దాన్ని డింగా డింగా అంటున్నారు. ఈ పేరు ఫన్నీగా ఉండొచ్చు కానీ.. ఈ వైరస్ మాత్రం ఫన్నీది కాదు. ఇది వచ్చినవాళ్లు డాన్స్ చేస్తున్నట్లు ఊగుతున్నారు. బాగా షేక్ అవుతున్నారు. ఇది ఎక్కువగా మహిళలు, బాలికల్ని పట్టుకుంటోంది. వారంతా ఎందుకు ఊగుతున్నారో అర్థం కావట్లేదు.
డింగా డింగా వైరస్ లక్షణాలు:
ఈ వైరస్ వచ్చిన వాళ్లకు జ్వరం ఉంటుంది.
వణుకుతున్నట్లుగా బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది.
ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి, ఊగుతున్నారు. అక్కడి నుంచి కదలలేకపోతున్నారు.
బండిబుగ్యో జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ కితియా క్రిస్టోఫర్.. ఈ వింత వైరస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారికి యాంటీబయోటిక్స్ ఇస్తున్నామని చెప్పారు. కమ్యూనిటీ హెల్త్ టీమ్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నాయనీ, ఇప్పటివరకూ ఎవరూ చనిపోలేదని తెలిపారు.