Monday, June 23, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్మస్క్‌ పార్టీ ‘ద అమెరికా పార్టీ’ అని వార్తలు..

మస్క్‌ పార్టీ ‘ద అమెరికా పార్టీ’ అని వార్తలు..

ట్రంప్, మస్క్ మధ్య తీవ్ర విభేదాలు..
మస్క్ ను ఆహ్వానించినా రష్యా..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్‌ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని మస్క్‌ ‘ద అమెరికా పార్టీ’ అనే పార్టీ ఏర్పాటు గురించి ఎక్స్‌లో సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఇప్పటికే సామాజిక మాధ్యమంలో అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. దీంతో ఈ మిలియనీర్‌ కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తీవ్ర విభేదాలు ఏర్పడిన క్రమంలో ఎలాన్‌ మస్క్‌కు రష్యా ఒక ఆఫర్‌ ఇచ్చింది. కావాలనుకుంటే మస్క్‌ తమ దేశంలో రాజకీయ ఆశ్రయం పొందవచ్చునని రష్యన్‌ చట్టసభ సభ్యుడు, అంతర్జాతీయ వ్యవహారాలపై స్టేట్‌ డుమా కమిటీ, రష్యన్‌ ఫెడరేషన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ మొదటి డిప్యూటీ చైర్మన్‌ డిమిత్రి నోవికోవ్‌ ఆహ్వానించారని రష్యాన్‌ వార్తా సంస్థ టాస్‌ వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments