తమ సమస్యలను విన్నవించిన కాలనీ వాసులు..
త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన హేమంత్ పాటిల్..
కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్, అధికారులు..
శనివారం రోజు ఉదయం వనస్థలిపురం డివిజన్ లో ఇంజనీర్స్ కాలనీలో పర్యటించారు జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్.. వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి..
ఇంజనీర్స్ కాలనీలలో కబ్జాక్ గురైన పార్కుని పరిశీలించారు.. వీరితోబాటు ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్, సర్కిల్ ఫోర్ రికార్డర్. మల్లికార్జున రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.కార్తీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.ఎండి రఫీ, ఏ ఈ విగ్నేశ్వరి, ఏ ఈ .యు బి డి. మేనేజర్ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు లు.. కాగా ఇంజనీర్స్ కాలనీలో నెలకొన్న సమస్యలు అన్నింటిని జోనల్ కమిషనర్ కి విన్నవించారు.. ఇంజనీర్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ మహిళలు, మల్లికార్జున నగర్ అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, నిరంజన్, ఆర్ టి సి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముకుంద రాజు, క్రిస్టియన్ కాలనీ హరీందర్ రెడ్డి, శక్తి నగర్ కాలనీవాసులు, మహిళలు, చిన్నపిల్లలు, కాలనీ పెద్దలు, అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
అదేవిధంగా జోనల్ కమిషనర్ ఇంజనీర్స్ కాలనీ వాళ్లు చెప్పిన సమస్యలు అన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

ముఖ్యంగా కబ్జాకు గురైన పార్కుని అతి త్వరలోనే పార్కుగా రూపొందిస్తామని.. సీసీ రోడ్డు, పార్కులో అవైలబుల్ గా జిమ్ కూడా శాంక్షన్ చేయిస్తానని కాలనీ వాసులందరికీ హామీ ఇచ్చారు.. కాలనీ వాసులు అందరు కలిసి కార్పొరేటర్ కి తమ కాలనీలో కబ్జాకు గురైన విషయాన్ని జోనల్ కమిషనర్, హైడ్రా కమిషనర్ రంగనాథ దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు..
ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ నరేందర్, శ్రీకాంత్ రెడ్డి, శైలి కుమార్, రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అర్జున్, భీమ్ రెడ్డి, కృష్ణాజి, సుబ్బారావు, మంద మోహన్ రాజు, రవికుమార్, సుష్మ, శిరీష, శారద, సునీత, కవిత, జగదీప్, ఇంద్ర, సంగీత, సమత, శ్రీనివాసరావు, నరసింహ, వీరబాబు, యాదయ్య, దత్తాత్రేయ, బాబు, భాస్కర్ నాయుడు, జ్యోతి, సృజన, శృతి, మాధవి, సంతోషి, లావణ్య, స్వప్నిక, సిరి, వివేక్ రాజు, ఈటిసి క్రిస్టియన్ కాలనీ ప్రెసిడెంట్ హరేందర్ రెడ్డి, మల్లికార్జున్ నగర్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, నిరంజన్, ఆర్టీసీ కాలనీ ప్రెసిడెంట్ ముకుంద రాజు, జైపాల్ రెడ్డి, క్రాంతి, శశిధర్ రెడ్డి, శక్తి నగర్ కిష్టయ్య రెడ్డి, వాసు చౌదరి తదితరులు పాల్గొన్నారు..


