Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణతీరంగా ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

తీరంగా ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ..
ర్యాలీలో పాల్గొన్న హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో నాగోల్ నుండి వనస్థలిపురం కాంప్లెక్స్ వరకు నిర్వహించిన తీరంగా ర్యాలీ కార్యక్రమం లో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రివర్ణ పతాకం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుందని. ఎందరో మహనీయుల పోరాటం వలన మనకు స్వాతంత్రం వచ్చిందని, అందుకే మనం ఈరోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము.. అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం “హర్ ఘర్ తీరంగా” ప్రతి ఇంటిపైన జెండా ఎగరాలి అనే నినాదం తీసుకొచ్చారు. కాబట్టి మనమందరము మన యొక్క ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మన యొక్క దేశభక్తిని చాటి చెప్పవలసిన బాధ్యత మన పైన ఉందని కార్పొరేటర్ చెప్పుకొచ్చారు.

ఈ యొక్క కార్యక్రమంలో ఎల్. బి. నగర్ నియోజకవర్గ బీజేపీ కార్పోరేటర్లు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు , మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments