ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
రూ. 10 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు..
హయత్ నగర్ డివిజన్ లోని రాఘవేంద్ర కాలనీలో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిధిలుగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాఘవేంద్ర కాలనికి సంబంధించిన కాలనీ సంక్షేమ సంఘం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం, మహిళా సంగం, ఆలయ కమిటీ, కాలనీ వాసులందరు కలసికట్టుగా ఉంటూ అతి తక్కువ స్థలంలోనే ఒక ప్రణాళికతో ఒకే చోట పోచమ్మ దేవాలయం, కాలనీ సంక్షేమ సంఘం భవనము, కాలనీ పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడం అభినందించవలసిన విషయమని, కాలనీ వాసులందరూ ఓపెన్ జిమ్ పరికరాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమం లో కాలనీ సంక్షేమ సంఘం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం, మహిళా సంగం, ఆలయ కమిటి సభ్యులు కాలనీవాసులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..


