అధికారులతో మాట్లాడి వివరాల సేకరణ..
తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
మహేశ్వరం నియోజకవర్గంలోని. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల ధాతు నగర్ లో బుధవారం నాడు షార్ట్ సర్క్యూట్ తో ధ్వంసం అయిన నివాసాలను పరిశీలించారు మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి.. అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పోరెడ్డి భాస్కర్ రెడ్డి, గజ్జెల రాంచందర్, బల్వంత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పోరెడ్డి సురేందర్ రెడ్డి, అధికారులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.


