వనపర్తి జిల్లా:
వనపర్తి పట్టణ కేంద్రంలో 9వ వార్డులో బోనమ్మ తండా లో ఆంజనేయ స్వామి గుడికి భూమి పూజ చేశారు. కౌన్సిలర్ విభూది మహేశ్వరి మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన వనపర్తి శాసనసభ్యులు తుడి మెగా రెడ్డి ఆదేశానుసారం తాండా, కాలనీవాసుల అభీష్టంమేరకు శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు చేసి జెసిబి సహాయంతో భూమి చదునుపనులు ప్రారంభించడం జరిగినది త్వరలోనే గుడికి కమ్యూనిటీ హాల్ కింద ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తారనీ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విభూది నారాయణ చీర్ల ఆంజనేయులు చీర్ల పాండు సాగర్ చీర్ల రాములు మాజీ కౌన్సిలర్ భాషా నాయక్ రాంజీ నాయక్ చీర్ల అయ్యన్న గుంటి రాజు చీర్ల సత్యం ఎల్లయ్య రాము నాయక్ తిరుపతి నాయక్ గుంటి మన్యం తదితరులు పాల్గొన్నారు.


