Friday, February 20, 2026
Google search engine
Homeతెలంగాణవిజయపురి కాలనీ సమస్యలను పరిశీలించిన అధికారులు

విజయపురి కాలనీ సమస్యలను పరిశీలించిన అధికారులు

ఎల్బీనగర్:

విజయపురి కాలనీ రోడ్ నెంబర్ 2లో వరద నీటి పైపు లైన్ పనులను పరిశీలిస్తున్న సంబంధిత అధికారులకు సమస్యల గురించి వివరిస్తున్న కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత.మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ విజయపురి కాలనీ రోడ్ నెంబర్ 2 లో జరుగుతున్న వరద నీటి పైపు లైన్ పనుల విషయంలో ఈఈ కార్తిక్, డిఈ విజయ్, ఏఈ ప్రశాంతి, జలమండలి మేనేజర్ రాజు, సివరేజ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, కాంట్రాక్టర్ శ్రీకాంత్ తో కలిసి పున్న గణేష్ నేత స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇక్కడి సమస్యలు తెలిపారు. విజయపురి కాలనీ స్ట్రీట్స్ నంబర్స్ 1,2,3 ల నుండి వస్తున్న డ్రైనేజ్ సమస్య గురించి ముఖ్యంగా జలమండలి అధికారులకు తెలియజేశారు. జిహెచ్ఎంసి ఇంజనీర్ విభాగం వారికి విజయపురి కాలనీ రోడ్ నెంబర్ 2 నుండి ఎస్ఎల్ఆర్ కాలనీ మధ్యలో (కొత్తపేట నుండి నాగోలు రోడ్డు) కల్వర్టు కట్టే విధంగా ఇప్పుడు జరుగుతున్న పనులతో పాటు కల్వర్టు కూడా కడితే శాశ్వతంగా పరిష్కారం జరుగుతుందని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ విషయం గతంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ ఉన్న వినయ్ కృష్ణారెడ్డి దృష్టిలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారే ఉన్నందున కమిషనర్ తో మాట్లాడి కల్వర్టు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అధికారులు కూడా సమస్యను అర్థం చేసుకొని కమిషనర్ తో మాట్లాడి కల్వర్టు కట్టే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.అధికారులతో, కాంట్రాక్టర్ తో సమన్వయం చేసుకొని పనులు జాప్యం జరగకుండా రోడ్ 2 లో శాశ్వత పరిష్కారం చేసే విధంగా పనులు చేయాలనీ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రవీంద్ర (హైటెక్ రాము) దుర్గాప్రసాద్, సీనియర్ సిటిజెన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,మహేందర్, సూర్య ప్రకాశ్, సందీప్, కృష్ణారెడ్డి, అనూదు కుమార్,రాము, శేషగిరి రావు మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments