ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి శనివారం ఉదయం నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేటర్‌గా తన పదవీకాలం పూర్తయినప్పటికీ నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాలనీ వాసులు ప్రస్తావించిన పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారానికి చర్యలు ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ ని కాలనీ వాసులు అభినందించారు. ప్రజల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు హరి బాబు, బుచ్చిరెడ్డి, హర్ష, కొత్త సాయి తరుణ్ రెడ్డి, దినేష్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, వివేక్ చారీ, సిద్దు, టీంకు, గిరీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.


