ఎల్బీనగర్:
సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ చౌరస్తా నుండి నాగోల్ చౌరస్తా వరకు రోడ్డును ఆక్రమించుకొని ఫుట్ పాత్ లపై వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికుల నుండి ఫిర్యాదులు అందడంతో ఆయా స్థలాలను టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. జిహెచ్ఎంసి సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కలిసి మంగళవారం, బుధవారం రెండు రోజులు శ్రమించి చైతన్యపురి పోలీసుల సహాయంతో ఆక్రమణలు తొలగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ మధు, సూపర్వైజర్ సాయి అర్చన, న్యాక్ ఇంజనీర్ సురేష్, సాయి, సిబ్బంది రాము తదితరులు పాల్గొన్నారు.


