Wednesday, July 8, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీపై కేసు నమోదు

అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీపై కేసు నమోదు

వైద్య పరికరాలు స్వాధీనం.. నిందితుడి అరెస్టు

ఎల్బీనగర్:

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయ్‌నగర్‌లో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అజయ్‌నగర్‌లోని సాయి సాత్విక్ క్లినిక్ పై తనిఖీ నిర్వహించారు. అక్కడ క్లినిక్ నిర్వహిస్తున్న ఆకుల కిషోర్ కుమార్ (44)ను విచారించగా, క్లినిక్ లేదా మెడికల్ షాప్ నిర్వహించేందుకు అవసరమైన ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు తన వద్ద లేవని తేలింది. అయినప్పటికీ ప్రజలకు వైద్య చికిత్స అందిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.తనిఖీల్లో క్లినిక్ నుంచి స్టెతస్కోప్, బీపీ చెకింగ్ మెషీన్, రెండు థర్మామీటర్లు, 40 సిరంజీలు, ప్రిస్క్రిప్షన్ బుక్, ఎనిమిది ఇంజెక్షన్లు, రెండు కత్తెరలు, ఐడీ కార్డు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్వాధీనం పంచనామా పూర్తి చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నాగోల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగోల్ పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments