నిర్వాహకులు సారిక, హేమలత, దీపిక ,సంతోషి సారధ్యంలో నాల్గవ బ్యాచ్ విజయవంతం
శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేసిన కిక్కర గోపి శంకర్ యాదవ్
ఎల్బీనగర్:
హయత్నగర్ కి చెందిన వినాయక్ నగర్ కాలనీలో పీపుల్స్ సర్వీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 41 వ రోజుల ఉచిత టైలరింగ్ శిక్షణ ఆదివారంతో ముగిసింది. ఇప్పటికి ఇది నాల్గవ బ్యాచ్ అని పీపుల్స్ సర్వీస్ నిర్వాకులు తెలియజేశారు. ఇంటి వద్ద ఖాళీగా ఉన్న మహిళలకు ఏదో ఒక నైపుణ్యం ఉండాలని, మహిళలు తమ కాళ్ల మీద నిలబడాలని ఉద్దేశ్యంతో ఉచిత టైలరింగ్ ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు సారిక, హేమలత, సంతోషి, దీపిక తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ హాజరై శిక్షణ తీసుకున్న 20 మంది మా మహిళలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ సర్వీస్ సంస్థ ప్రతినిధులు, సురక్ష సభ్యులు పిల్లి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.


