ఎల్బీనగర్:
సరూర్‌నగర్ సర్కిల్ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 3 ఎగ్ కార్ట్‌లను సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, బ్యాంకుల ద్వారా రుణాలు పొంది చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా భవానీ నగర్‌లోని శ్రీ విఘ్నేశ్వర పొదుపు సంఘం, జీబీఆర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ పొదుపు సంఘం, మరియు శ్రీ లలితాంబికా పొదుపు సంఘం సభ్యులకు ఎగ్ కార్ట్‌లను అందజేసి ప్రారంభించారు.యూసీడీ విభాగం ప్రాజెక్ట్ అధికారి విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి ద్వారా వ్యాపార రంగంలో ముందుకు సాగి, ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు జి. సహదేవ్, సైదులు, శ్రీమతి శోభన, ఆర్‌పీలు పరమేశ్వరి, శిల్ప, సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, నాగలక్ష్మి మరియు వివిధ పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


