Friday, August 7, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ సచివాలయంలో వైభవంగా బోనాల ఉత్సవాలు..

తెలంగాణ సచివాలయంలో వైభవంగా బోనాల ఉత్సవాలు..

  • అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
  • ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులుగా ఉండాలని ఆకాంక్షించిన సీఎస్
  • పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో మార్మోగిన సచివాలయ ప్రాంగణం

హైదరాబాద్:

రాష్ట్ర ప్రపాలనా హృదయమైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం బోనాల పండుగను అత్యంత కనులపండువగా, వైభవంగా నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
సచివాలయ ఆవరణలోని ప్రసిద్ధ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయం వద్ద వేదమంత్రోచ్ఛారణల నడుమ సీఎస్ పూజలు జరిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలో సర్వత్ర సుభిక్షం, శాంతిభద్రతలు మరియు నిరంతర అభివృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

*ఉత్సాహంగా సాగిన వేడుకలు:
ఈ ఉత్సవాల్లో సచివాలయ ఉద్యోగులు మరియు అధికారులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బోనాలను తలపై మోసుకుంటూ వచ్చి అమ్మవారికి సమర్పించారు. మరోవైపు కళాకారుల డప్పు వాయిద్యాలు, లయబద్ధమైన చప్పుళ్లు, పోతరాజుల వీర విన్యాసాలు మరియు వివిధ పౌరాణిక వేషధారణల ప్రదర్శనలు సచివాలయ ప్రాంగణమంతటా ఆధ్యాత్మిక శోభను సంతరించాయి. భక్తుల కోలాహలంతో సచివాలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments