ఎల్బీనగర్:
సరూర్నగర్ శ్రీ భవాని శంకర్ ఆలయం, పోచమ్మ ఆలయం వద్ద శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 30 అడుగుల మట్టి మహా గణపతిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణహితంగా 30 అడుగుల మట్టి మహా గణపతిని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణనాథుని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలు భక్తి, శ్రద్ధలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలుకూరి రాంరెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ బీజేపీ ఇన్చార్జ్ సామా రంగారెడ్డి, బీజేపీ మాజీ కార్పొరేటర్లు ఆకుల శ్రీ వాణి, కొత్తకాపు అరుణ, రవీందర్ రెడ్డి, శ్వేతా మధుకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, సివి. సత్యనారాయణ, అశోక్, డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, మిట్టపల్లి నరసింహ, గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు సిరిరెడ్డి సతీష్ చారి, బాబు చౌదరి, కాసం రాంరెడ్డి, సుబ్బారెడ్డి, నగేష్ నాయక్, శ్రీనివాస్ గుప్తా, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


