ఎల్బీనగర్
ఎల్బీనగర్ సిరి నగర్ కాలనీలో అజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల సందర్బంగా 26వ సంవత్సరం ఘనంగా అన్నదానం నిర్వహించారు. ఆజాద్ యూత్ సభ్యులు కుంచెం భాగ్యమ్మ, కుంచెం వెంకటేశం దంపతుల ఆధ్వర్యంలో సుమారు 15 వందల మందికి యూత్ సభ్యులు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, 26వ తేదీ రోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుంచెం ప్రవీణ్ కుమార్ గుప్తా, శ్రీకాంత్, మల్లికార్జున్, వినోద్, రఘు, ప్రశాంత్, శ్రీనివాస్, రాఘవేందర్,దొర బాబు,శివ, కిషోర్,సురేష్, రిషీ, రాజు, కిరణ్, రితిష్,సాయి దేవరకొండ,రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


