Tuesday, July 21, 2026
Google search engine
Homeతెలంగాణపోచమ్మ ఆలయంలో చోరీ… నిందితుడు అరెస్ట్

పోచమ్మ ఆలయంలో చోరీ… నిందితుడు అరెస్ట్

ఎల్బీనగర్

గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సరస్వతీ నగర్ పోచమ్మ బస్తీ పోచమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును సరూర్ నగర్ పోలీసులు చేదించారు. ఈనెల 16న పోచమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బర్ల అనిల్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి అమ్మవారి సొమ్ములతోపాటు, హుండీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు, జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలు కావడంతో నిందితుడు చోరీ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.. 16వ తేదీ అర్ధరాత్రి దేవాలయంలోకి చొరబడి తాళాలు పగలగొట్టి, సీసీ టీవీ వైర్లు కట్ చేసి అమ్మవారి బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు, హుండీ తాళాలు పగలగొట్టి నగదును తస్కరించి నిందితుడు పరారయ్యాడు. సీసీ టీవీ ఫుటేజ్, విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిందితుడి ఆనవాళ్లను గుర్తించి అరెస్టు చేసి అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.. నిందితుడు అనీల్ ను రిమాండ్ కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన క్రైమ్ ఎస్సై మహేందర్, సిబ్బందిని డిఐ శేఖర్,సీఐ శ్రీశైలం అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments