Saturday, July 25, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్*బాలాపూర్ డివిజన్‌లో ముమ్మరంగా ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియ

*బాలాపూర్ డివిజన్‌లో ముమ్మరంగా ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియ

*ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు చిగిరింత నరసింహారెడ్డి

మహేశ్వరం:

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జీహెచ్‌ఎంసీ బాలాపూర్ డివిజన్‌లో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల నమోదు మరియు సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి, పర్యవేక్షించారు. డివిజన్ పరిశీలకుడు సురేష్ రెడ్డితో కలిసి ఆయన డివిజన్ పరిధిలోని వివిధ కేంద్రాలలో జరుగుతున్న ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేలా చూసేందుకు, జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సవరణలు జరిగేలా చూడాలని ఈ సందర్భంగా చిగిరింత నరసింహారెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు.

*కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ పరిశీలన కార్యక్రమంలో పార్టీ నాయకులు సమన్వయంతో పాల్గొని ఓటర్ల నమోదుపై వివరాలు సేకరించారు. పాల్గొన్న ప్రముఖులు:
వంగేటి ప్రభాకర్ రెడ్డి(మాజీ కార్పొరేటర్),
నిరుడు శ్రీరాములు (డివిజన్ అధ్యక్షుడు),చిగిరింత దయాసాగర్ రెడ్డి (యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు)
బలింగని జంగయ్య,గొరిగే శ్రీశైలం,ఇక్కే శ్రీను,బద్దం రాము గౌడ్ ,టేకుల సుధాకర్ రెడ్డి, ఇక్కే కొండల్ ,సంరెడ్డి మహిపాల్ రెడ్డి, *శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments