ఎల్బీనగర్:
రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కి గౌడ్ గురువారం ఉదయం దిల్షుక్నగర్ శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో సాయినాథుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకంలో పాల్గొని,పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు కిరీటం, బంగారు బిళ్లపత్రమాలను స్వామివారికి ప్రతిష్టింపజేశారు. ఈ సందర్భంగా పండితులు వారికి ఆశీర్వాదం అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వేదిరె యోగేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు తులసి శ్రీనివాస్, సునీల్ బాబు, వేణుగోపాల్ యాదవ్, శశిధర్ రెడ్డి, ప్రేమ్ నాథ్ గౌడ్, బబ్బూరి ఆనంద్ గౌడ్, దాము మహేందర్ యాదవ్, నాగార్జున రెడ్డి, శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


