Saturday, August 15, 2026
Google search engine
Homeతెలంగాణహర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో గడ్డిఅన్నారం డివిజన్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ..

హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో గడ్డిఅన్నారం డివిజన్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ..

ఎల్బీనగర్:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జీ సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను అభినందించారు.నేతాజీ నగర్‌లోని చైతన్య టెక్నో స్కూల్ నుంచి వి.వి. నగర్ బస్ స్టాప్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఎస్ఆర్కెఎస్ విద్యాలయ హై స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, సుమేధా మోడల్ హై స్కూల్, పాణనీయ మహా విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని, దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొని జాతీయ సమైక్యత, దేశభక్తి స్ఫూర్తిని చాటారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరంగా కేవలం ఒక జెండా కాదని, కోట్లాది భారతీయుల గౌరవం, త్యాగం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా దేశంపై మనకున్న గౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావాలను మరింత పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేసి, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి.. దేశమే ప్రథమం – జాతీయ జెండానే గర్వం అనే స్ఫూర్తిని చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిలుకూరి రామ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళి, కాసం రాంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజేశ్వరి,నగేష్, భీష్మాచారి, సుబ్బారెడ్డి, సిరి రెడ్డి, సందీప్, మహేందర్ రాజు, సతీష్ చారీ, రత్నం, వివేక్, వివేక్ చారీ, శ్రీకాంత్, శ్రీనివాస్, శివ రామ్, సంతు నాయక్, హరీష్ రాహుల్, సిద్దు, టీంకు, వంశీ గంగపుత్ర, రఘునందన్ జోషి, పవన్, సాయి రెడ్డి, విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments