- పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
- భూముల మీద అతిఎక్కువ నాలెడ్జ్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి. భూములు గుంచుకోవడంలో రీసెర్చ్ స్కాలర్.
- దళిత రైతులను రేవంత్ రెడ్డి పగపట్టాడు.
- రేవంత్ రెడ్డి ల్యాండ్ బ్రోకర్ గా మారాడు.
- బౌరంపేట దళితులకు బీజేపీ అండగా ఉంటుంది.
- మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్ళీ ఓట్లు వేయరు.
- కన్నతల్లి లాంటి భూతల్లి మీదనా మీ దౌర్జన్యం.
- దళిత భూములు అమ్ముకొని జీతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు.
- పేదలని ఇబ్బంది పడితే రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వ అంతు చూస్తాము.
- – మీ మెడలు వంచుతాం.- ఈటల రాజేందర్.
మేడ్చల్ మల్కాజిగిరి:
తెలంగాణలో ప్రజా పాలన ముసుగులో పేదల భూముల దోపిడీ యజ్ఞం సాగుతోందని, రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో దళిత రైతులు చేస్తున్న ధర్నా శిబిరానికి వెళ్లి, వారిని పరామర్శించి, భూములను పరిశీలించిన అనంతరం ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
*భూదాహంపై రీసెర్చ్ స్కాలర్ రేవంత్ రెడ్డి:
పరిపాలనానుభవం లేదనుకున్న రేవంత్ రెడ్డి.. పేదల బ్రతుకుల్లో మట్టికొట్టడంలో మాత్రం ‘రీసెర్చ్ స్కాలర్’ అయ్యాడని ఈటల ఎద్దేవా చేశారు. భూముల మీద మరే ముఖ్యమంత్రికి లేనంతటి అసాధారణ పరిజ్ఞానం ఆయనకు ఉందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సౌభాగ్యమన్న కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు అదే ఇందిరమ్మ కాలంలో దళితులకు ఇచ్చిన భూములను లాక్కుంటూ కన్నతల్లి లాంటి భూతల్లిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- సర్వే నంబర్ల దురాక్రమణ: బౌరంపేటలోని సర్వే నంబర్ 472, 166లలో ఐదు తరాలుగా వ్యవసాయం చేసుకుంటూ, సక్రమంగా పన్నులు చెల్లిస్తున్న ముప్పై కుటుంబాల వారిని.. నేడు సుమారు నాలుగు వందల కుటుంబాలుగా విస్తరించిన దళిత పేదలను బలవంతంగా రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- హైడ్రా, ల్యాండ్ బ్రోకర్ విధానాలు: హైడ్రా పేరుతో అర్ధరాత్రి పూట ఫెన్సింగ్‌లు వేస్తూ, భూభారత్ పేరిట పేదల భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం.. ల్యాండ్ బ్రోకర్ కంపెనీలా మారుతోందని విమర్శించారు. దళితుల భూములు అమ్ముకొని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తారా అని నిలదీశారు.
*కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ పాలన:
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న దళిత వాడలు, బస్తీలు నేడు ఆ పార్టీ నేతల ఆగడాలకు బలవుతున్నాయని బాధితులు వాపోయారు. “ఓట్లేసి గెలిపించినందుకు మా భూములు గుంజుకుంటారా? మా ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న నేల ఇది.. మమ్మల్ని బతకనివ్వకుండా చంపి తీసుకోండి” అంటూ మహిళలు, దళిత రైతులు రోధించారు. సుమారు 31 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే సబ్‌స్టేషన్ పేరిట 11 ఎకరాలు లాక్కున్నారని, ఇప్పుడు మిగిలిన భూములపై కన్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
*బీజేపీ నుంచి తీవ్ర హెచ్చరిక
పేదల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తే ప్రభుత్వాల అంతు చూస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బహదూర్పగూడలో గతంలో రైతుల భూములు లాక్కుంటే ఎలా అడ్డుకున్నామో, బౌరంపేట దళిత రైతులకు కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో ఉక్కుపాదం మోపి, మెడలు వంచుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి కృష్ణారెడ్డి, మంగమ్మ, సుధాకర్ గాండే, వాసు, రాజిరెడ్డి, మల్లేష్, సతీష్, శివాజీ, ప్రభాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, జంగారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



