Thursday, August 20, 2026
Google search engine
Homeతెలంగాణపశ్చిమాసియాలో ముసలం: ఇరాన్‌తో సర్వ తెంపులు చేసుకున్న యూఏఈ!

పశ్చిమాసియాలో ముసలం: ఇరాన్‌తో సర్వ తెంపులు చేసుకున్న యూఏఈ!

  • వాణిజ్య, ఆర్థిక ఒప్పందాల రద్దు.. గల్ఫ్ జలాల్లో క్షిపణుల కలకలం..
  • ఉప్పెనలా మారుతున్న ప్రాంతీయ యుద్ధ మేఘాలు

అబుదాబి/టెహ్రాన్:

పశ్చిమాసియా రణరంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పొరుగుదేశం దుందుడుకు చర్యలతో విసిగిపోయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ఇరాన్‌తో ఉన్న సమస్త వ్యాపార, వాణిజ్య, ఆర్థిక ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ బహిష్కరణ పూర్తిస్థాయిలో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

*క్షిపణుల వర్షం.. భద్రతా ముప్పు:
అమెరికా-ఇరాన్ మధ్య
రగులుతున్న యుద్ధానలంలో గల్ఫ్ ప్రాంతం పూర్తిగా అట్టుడుకుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బలగాలు అంతర్జాతీయ నౌకా మార్గాలను, గల్ఫ్ దేశాల షిప్పింగ్ రూట్లను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. యూఏఈ సరిహద్దు జలాల్లోనూ, దేశ భూభాగంలోనూ క్షిపణులు పడటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. యూఏఈ రక్షణ వ్యవస్థలు అప్రమత్తమై వాటిని కూల్చివేస్తున్నప్పటికీ, సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచివుంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే అబుదాబి ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. తమ దేశ సముద్ర జలాలపైకి క్షిపణులను ప్రయోగిస్తూ ప్రాంతీయ శాంతికి తూట్లు పొడుస్తున్న ఇరాన్‌తో ఇకపై ఎలాంటి వాణిజ్య సంబంధాలు కొనసాగించేది లేదని తేల్చిచెప్పింది.

*ఖండించిన టెహ్రాన్.. అప్రమత్తమైన యంత్రాంగం
యూఏఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయెలి బకాయే తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, ప్రాంతీయ విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే యూఏఈ ఈ వ్యాఖ్యలు చేస్తోందని కొట్టిపారేశారు.
మరోవైపు, ఇరాన్ దూకుడు కారణంగా యూఏఈ అంతర్గతంగా అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా పౌరులకు ఎమర్జెన్సీ అలర్ట్‌లు జారీ అయ్యాయి. క్షిపణుల ముప్పు పొంచివున్నందున ప్రజలంతా సురక్షిత ప్రాంతాలు, ఇళ్లలోనే తలదాచుకోవాలని అధికారులు హెచ్చరించారు. అటు వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. అమెరికాతో అధికారిక ఒప్పందం కుదిరే వరకు ఈ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుండగా, ఆ జలసంధి పూర్తిగా తమ వ్యూహాత్మక నియంత్రణలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలనుస్తంభింపజేయడమే కాకుండా, ప్రపంచ ఇంధన భద్రతను పెను ప్రమాదంలోకి నెడుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments