Thursday, August 20, 2026
Google search engine
Homeతెలంగాణనేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయి : ఏసిపి కాశిరెడ్డి

నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయి : ఏసిపి కాశిరెడ్డి

ఎల్బీనగర్:

నేరాలు అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వనస్థలిపురం ఏసిపి, ఎల్బీనగర్ ఇన్చార్జ్ ఏసీపీ కాశిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సరూర్నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 6 లో కాలనీ అసోసియేషన్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ మల్కారం సుధాకర్ చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు నేరాలను అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. సీసీ కెమెరాలు నేరాలను ఏ విధంగా అదుపు చేస్తున్నాయో ఉదాహరణలతో సహా ఆయన వివరించారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ వారు ఎంతగానో శ్రద్ధ చూపించినందుకు ఏసీపి అభినందించారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ ప్రతీ కెమెరా 100 పోలీసులతో సమానమని పేర్కొన్నారు. కాలనీ వారు పోలీసులకు సహకారం అందిస్తే నేరాలను సులువుగా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి కాలనీ వారు సరూర్ నగర్ లో గల వెంకటేశ్వర కాలనీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం కాలనీ అసోసియేషన్ సభ్యులు ఏసిపి ఇన్స్పెక్టర్ పోలీసు సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గండు ధనంరెడ్డి, గౌరవ అధ్యక్షుడు బోయిని మహేందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు మునగాల నరేష్, ప్రధాన కార్యదర్శి
పివిఎస్ ప్రసాద్, కోశాధికారి సోమ వెంకట్, జాయింట్ సెక్రటరీలు సుబ్రహ్మణ్యం, సప్పిడి గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి టీ.శ్రీనివాసరావు, బోయిని శంకర్ యాదవ్ , సలహాదారులు తులసి కృష్ణమూర్తి, కనకారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చెన్న అనిల్, రవి గౌడ్, కాలనీ వాసులు యాదగిరి రెడ్డి, గండి వెంకట్రావు, మాధవరావు, జగ్గారావు, మాధవరెడ్డి, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments