ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని న్యూ గడ్డిఅన్నారం కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద స్ట్రామ్ వాటర్ నాలా నిర్మాణం పూర్తయినప్పటికీ, కనెక్టివిటీ పనులు పెండింగ్లో ఉండటంతో ఈ సమస్యపై బీజేపీ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు బుధవారం ఉదయం డివిజన్ ఏఈ సాయితో కలిసి నాలా కనెక్టివిటీ పనులను ప్రారంభించి,పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో నాలా కనెక్టివిటీ పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ప్రతిరోజూ పనులను అధికారులు పర్యవేక్షిస్తూ నాణ్యతతో పాటు పనుల వేగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నాలా కనెక్టివిటీ పనుల సమయంలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.


