ఎల్బీనగర్:
హైద్రాబాద్ లోని రవీంద్ర భారతి అసెంబ్లీ ముందు ఉన్న విగ్రహం దగ్గర తొలి తరం స్వతంత్ర సమరయోధులు త్యాగదనులు తొలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకల కార్యక్రమం పుష్పాంజలి ప్రకాశం అభివృద్ధి మరియు అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం అసెంబ్లీ వద్ద ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన దేశ సేవ మరవ లేనిదని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులుకి భారతరత్న బిరుదు ప్రధానం చేయవలసిన అవసరం ఉందని దానికి కృషి చేస్తానని చెప్పారు.ప్రధాన సలహాదారు రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ, ప్రకాశం పంతులు తొలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయని కొనియాడుతూ వారి దూర దృష్టి వారి తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ బుద్ధి రాంప్రసాద్ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు విలువలు కలిగిన రాజకీయ నేత అని దార్శనికుడు అని గ్రామ స్వరాజ్యానికి కృషి చేశారని ఆయనకు భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ రామదాసు టంగుటూరు రచించిన సురపరిచిన జయజయహో ఆంధ్ర కేసరి గీతం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ చీఫ్ సెక్రటరీ, రుద్రరాజు పద్మరాజు సంస్థ ముఖ్యసలహాదారు మాజీ చీప్ విప్ స్వర్గీయ పీవీ నరసింహారావు కుమార్తె ఎమ్మెల్సీ శ్రీమతి వాణి సురభి ప్రకాశం మనవరాలు శ్రీమతి సరోజ ప్రముఖ సినీ దర్శకులు ఆదిత్య మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి నివాళి అర్పించారు. అలాగే ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ సభ్యులు సర్వసరి డాక్టర్ పి మోహన్, వక్కలంక శ్రీనివాస్ రావు, నిరంజన్ దేశాయ్,రాజశేఖర్, రామ్మోహన్ రెడ్డి, రాధాకృష్ణ, మంగపతి రావు, ఎన్ఎస్ఎన్ మూర్తి, శివన్న తదితర నాయకులు పాల్గొన్నారు.


