- సోషల్ జస్టిస్ పార్టీ వినూత్న కార్యక్రమం
- బస్తీ వాసుల వద్దకు పార్టీ.
ఎల్బీనగర్:
హైదరాబాద్ నగరంలో బస్తివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో సోషల్ జస్టిస్ పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బస్తీ దర్బార్ సర్కార్ వద్దకు సామాన్యుల గళం పేరిట మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఎన్టీఆర్ నగర్లోని దుర్గా వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలస్వామి తెలిపారు. సోమవారం నాడు ఇక్కడ ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ బస్తీలు ఏర్పడి దశాబ్దాలు పూర్తికావస్తున్న బస్తి ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పరిపాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బస్తీ ప్రజలను ఓట్ బ్యాంకులుగా వాడుతున్నారు తప్ప వారి సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఇంటి స్థలాలకు పట్టాలు, బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న కనీస వసతుల కల్పన, బస్తీ వాసుల సమస్యలు, పారిశుద్య సమస్యలు వంటి మరెన్నో ఉన్నాయని వాటి గురించి తెలుసుకొని సంబంధిత అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సోషల్ జస్టిస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ నగర్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని అవన్నీ తెలుసుకుని పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు చామకూర రాజు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కె.వి గౌడ్ హైదరాబాద్ హైడ్రా ఏరియా ఇంచార్జ్ వరంగల్ రమేష్, అధికార ప్రతినిధి ప్రశాంత్ మహర్షి, సహాయ కార్యదర్శి సతీష్ మహాజన్, రాపాక వెంకట్దివ్యాంగ్ విభాగ అధ్యక్షులు ఎమ్మెస్ యాదవ్ తదితరులు పాల్గొ పాల్గొంటారని వారు తెలిపారు. బస్తి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు తెలియజేసి విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు.


