Home స్పోర్ట్స్ మెగా వేలంలోకి పంత్…దక్కించుకోవాలనుకుంటున్న ఆర్.సి.బి మరియు మిగతా జట్లు!

మెగా వేలంలోకి పంత్…దక్కించుకోవాలనుకుంటున్న ఆర్.సి.బి మరియు మిగతా జట్లు!

0
84
Panth into the mega auction
Panth into the mega auction

ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్ష‌న్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే ఓక ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్‌ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 చివరి గడువుగ బీసీసీఐ ఇచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఆ న్యూస్ ఏమిటంటే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆ ఫ్రాంచైజీని విడి మెగా వేలంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

Is rishab panth participate in 2nd test or not..?
Is rishab panth participate in 2nd test or not..?

ఈసారి ఎలాగైనా ఐపీల్ ట్రోఫీ గెలవాలని ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తుంది. దీని కోసమే ఆ జట్టు మేనేజ్మెంట్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రికీ పాంటింగ్‌ను కోచ్ మరియు సౌరవ్ గంగూలీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి తొలగించింది . వీరి స్థానాల్లో హేమాంగ్ బాదౌని మరియు వేణుగోపాల్ రావులను తీసుకుంది. అయితే కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని ఢిల్లీ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుకు రిషబ్ పంత్ ఒప్పుకోలేదట. తనకే సారథ్య బాధ్యతలు కావాలని డిమాండ్ చేశాడని తెలుస్తోంది.దీంతో పంత్ డిమాండ్‌ను డీసీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదని తెలుస్తుంది . దాంతో ఢిల్లీని వీడాలని పంత్ అనుకున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.

ఒక వేళా మెగా వేలంలోకి రిషబ్ పంత్‌ వస్తే దక్కించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఆర్.సి.బి కి ఇప్పుడు కెప్టెన్, వికెట్ కీపర్ అవసరం ఎంతో ఉంది. అది కూడా ఇండియన్ ప్లేయర్ కావడంతో ఆర్.సి.బి ఇప్పుడు పంత్ పై కన్నేసింది. ఇంకోవైపు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు కూడా తమ జట్టుకు కెప్టెన్‌గా పంత్‌ను దక్కించుకోవాలని అనుకుంటున్నాయి అని సమాచారం.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here