- మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌లను కలిసిన బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు
- బాలాపూర్ గణేశుని దర్శనానికి రావాల్సిందిగా ఘనంగా ఆహ్వానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
హైదరాబాద్:
ప్రపంచ ప్రఖ్యాత బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగింది. బంజారాహిల్స్‌లోని మంత్రుల సముదాయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌లను బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా రాబోయే ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా మహా గణపతిని దర్శించుకోవాలని కోరుతూ ఆయా ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశుని ఉత్సవాల ప్రాముఖ్యతను, భక్తుల రద్దడిని ఈ సందర్భంగా ప్రముఖులకు వివరించారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కళ్ళెం నిరంజన్ రెడ్డి, కమిటీ ప్రముఖులు చిగిరింత దయాసాగర్ రెడ్డి, వంగేటి ప్రణయ్ రెడ్డి, నిరుడు శ్రీరాములు, గిరికటి కృష్ణంరాజు గౌడ్, నరహరి గౌడ్, మహిపాల్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


