Monday, September 21, 2026
Google search engine
Homeతెలంగాణరంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బాధ్యతల స్వీకరణ -

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బాధ్యతల స్వీకరణ –

ప్రముఖులతో మర్యాదపూర్వక భేటీ

  • రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు..
  • మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఘన సత్కారం
  • జిల్లా నాయకత్వ ఎంపిక పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిగురింత దంపతులు..

హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు స్వీకరించారు.

అనంతరం రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్కను కలిసి శాలువాతో సత్కరించారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలను తనకు అప్పగించడంలోనూ, ఈ నియామక ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన నాయకులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి, జిల్లాలో సంస్థాగత పటిష్టతకు మరింత అంకితభావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments